అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థల్లో విధిగా జాతీయ పతాకాన్ని ఎగురవేయాల్సిందే:సౌదీ
- August 26, 2020
రియాద్:జాతీయ పతాకానికి సంబంధించి సౌదీ ప్రభుత్వం కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది. ఇక నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ అధికారిక భవనాలపై సౌదీ జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని సూచించింది. పవిత్ర మక్కా గవర్నర్, రాయల్ సలహాదారుడు ప్రిన్స్ ఖలేద్ అల్ ఫైసల్ ఈ మేరకు మార్గనిర్దేశకాలను విడుదల చేశారు. ఇక నుంచి ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల బిల్డింగ్ లపై వారంలో ప్రతి రోజు జాతీయ పతాకం ఎగురుతూనే ఉండాలని ఈ కొత్త మార్గనిర్దేకాల సారాంశం. సౌదీ జాతీయ పతాక చట్టం ప్రకారం ప్రతి కార్యాలయం బిల్డింగ్ పై జాతీయ పతాకం రెపరెపలాడుతూ ఉండాలి. కానీ, యువరాజు ఖలేద్ తన పరిశీలనలో చాలావరకు కార్యాలయాలు ఈ నిబంధనలను పట్టించుకోలేదని నిర్ధారించుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన యువరాజు ఇక నుంచి ప్రతి కార్యాలయ భవనాలపై సౌదీ జాతీయ పతాకం ఎగురుతూనే ఉండాలని ఆదేశించారు. అంతేకాదు..ప్రతి కార్యాలయంపై జాతీయ పతాకం విధానం అమలు ఆదేశాలను యువరాజు స్వయంగా పరిశీలించనున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష