షూటింగ్ పూర్తి చేసుకున్న ‘తొలిశ్వాస’
- August 26, 2020
ప్రీతమ్ అల్లాడి, శిఖా బత్ర జంటగా నటిస్తున్న చిత్రం ‘తొలిశ్వాస’. ఈ చిత్రంతో ఖాలాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జెసీ.సి బ్యానర్‌పై జుబేర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తల్లిప్రేమ యొక్క గొప్పతనం చెబుతూ.. రొమాంటిక్ లవ్ అండ్ సైన్స్ స్టూడెంట్స్ నేపథ్యంతో.. మెసేజ్ ఓరియంటెడ్ చిత్రంగా ఈ ‘తొలిశ్వాస’ రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘తల్లిప్రేమను ఇప్పుడున్న జనరేషన్ ఎలా మిస్ అవుతున్నారు అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందిస్తున్నాము. అలాగే రొమాంటిక్ లవ్ అండ్ సైన్స్ స్టూడెంట్స్ బ్యాక్‌డ్రాప్‌తో మంచి మెసేజ్‌ని ప్రేక్షకులకు ఈ చిత్రంతో అందించబోతున్నాము. ప్రేమలోని సరికొత్త కోణాన్ని ఈ చిత్రంతో ఆవిష్కరించబోతున్నాం. యూత్‌కు, అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటాయి. మిస్టర్ తెలంగాణ, మిస్టర్ సౌత్ ఇండియా టైటిల్ విన్నర్ ప్రీతమ్, శిఖా బత్రల నటన ఈ చిత్రానికి మెయిన్ హైలెట్. ప్రస్తుతం షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము..’’ అని తెలిపారు.
ప్రీతమ్, శిఖా బత్ర, సంధ్యా జనక్, మణి మహేష్, రేణు వర్మ, జయరామ్, వైభవ్ శైలేష్, సంజీవ కుమార్, ప్రభ తదితరులు నటించిన ఈ చిత్రానికి స్టంట్స్: రాజా, కొరియోగ్రఫీ: సందీప్, మ్యూజిక్: మహి మదన్ ఎమ్ఎమ్, ఎడిటర్: సునీల్, కెమెరామెన్: రమేష్, నిర్మాత: జుబేర్, దర్శకత్వం: ఖాలాద్.
తాజా వార్తలు
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!







