నందు, రష్మీ జంటగా బొమ్మ బ్లాక్ బస్టర్ టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల
- August 26, 2020
యంగ్ టాలెంటెడ్ హీరో నందు, డస్కీ బ్యూటీ రష్మీ జంటగా విజయీభవ ఆర్ట్స్ పతాకం పై పవ్రీణ్ పగడాల, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డీ మడ్డి, మనోహార్ రెడ్డి ఈడా నిర్మాతలుగా రాజ్ విరాఠ్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రొడక్షన్ నెం 1కి తాజాగా చిత్ర బృందం టైటిల్ ఖరారు చేశారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీకి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టైటిల్ పెట్టినట్లుగా చిత్ర నిర్మాత ప్రవీణ్ పగడాల ప్రకటించారు. దాంతో పాటే టైటిల్ లుక్ పాటు తో పాటు మోషన్ పోస్టర్ ని కూడా చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ విరాఠ్ మాట్లాడుతూ
బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టైటిల్ కి తగ్గట్లుగానే సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని పక్కగా ఎంటర్ టైన్ చేస్తుందని మా టీమ్ మొత్తం కాన్ఫిడెంట్ గా ఉన్నాము. ఈ సినిమాలో నందు, రష్మీ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. నా స్టోరీని నమ్మి నామీద నమ్మకంతో నాకు ఈ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చిన విజయీభవ బ్యానర్ వారికి, చిత్ర నిర్మాతలు ప్రవీణ్ పగడాల, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డి మడ్డి, మనోహర్ రెడ్డి ఈడా గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాకి సంబధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు.
తారాగణం
నందు, రష్మి
సాంకేతిక వర్గం
బ్యానర్ - విజయీభవ ఆర్ట్స్
నిర్మాత - ప్రవీణ్ పగడాల, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డి మడ్డి, మనోహర్ రెడ్డి ఈడా
మ్యూజిక్ - ప్రశాంత్ ఆర్ విహారీ
డిఓపి - సుజాతా సిద్ధార్థ్
ఎడిటర్ - బి సుభాస్కర్
పీఆర్ఓ - ఏలూరుశ్రీను
డైరెక్టర్ - రాజ్ విరాఠ్
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?