యూఏఈ తో భారత్ మిస్సైల్ వ్యాపారం..వర్కౌట్ అవుతుందా?

- August 29, 2020 , by Maagulf
యూఏఈ తో భారత్ మిస్సైల్ వ్యాపారం..వర్కౌట్ అవుతుందా?

న్యూఢిల్లీ: అరబ్ దేశాలు క్రూడ్ ఆయిల్ సంపాదనతో విలాసవంతమైన జీవితాలను గడుపుతుంటాయి. కానీ.. వారి రక్షణ కోసం సొంతంగా ఆయుధాలను తయారుచేసే నైపుణ్యత వారికి లేదు. అందుకే అమెరికా, రష్యా నుండి ఆయుధాలను కొనుగోలు చేస్తుంటాయి. అయితే భారతదేశం కూడా ఇటీవలే ఆయుధ మార్కెట్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. భారత్ తయారుచేసిన బ్రహ్మోస్ క్షిపణులను ఇతర దేశాలకు అమ్మాలని నిర్ణయించింది. దీంతో వీటి కోసం ఇప్పటికే 5.5 బిలియన్ డాలర్ల ఆర్డర్లు వచ్చాయి. తాజాగా దుబాయ్ కూడా బ్రహ్మోస్ క్షిపణులను తమకు అమ్మాలని భారత్ను కోరుతుంది. నిజానికి దుబాయ్ భారత్కు మిత్రదేశం అయినప్పటికి అక్కడ కొన్ని ఉగ్రవాద సంస్థలు ఉండడం వల్ల వీటిని అమ్మలా.. వద్దా.. అని భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఒకవేళ దుబాయ్ కి బ్రహ్మోస్ అమ్మితే పొరపాటున అవి ఉగ్రవాదుల చేతికి చిక్కి.. వారు ఇతర దేశాలపైకి ప్రయోగిస్తే దుబాయ్ సైన్యం నుండి ఉగ్రవాదులకు చేరాయి కాబట్టి ఉగ్రవాదులు దాడి చేసినప్పటికీ దుబాయ్ దాడి చేసినట్లుగా భావిస్తారు. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. అందుకే భారత ప్రభుత్వం దుబాయ్ కి బ్రహ్మోస్ అమ్మాకంపై తీవ్రంగా పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో దుబాయ్ రష్యాను భారత్ బ్రహ్మోస్ అమ్మేందుకు రికమండేషన్ చేయాలని కోరింది. భారత ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి...!!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com