దలైలామా భద్రతపై నిఘా పెంచిన భారత్

- August 29, 2020 , by Maagulf
దలైలామా భద్రతపై నిఘా పెంచిన భారత్

దలైలామాకి భద్రతను మరింత పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టిబెట్ను చైనా అక్రమించడంతో అక్కడ వుండే బౌద్ద గురువు దలైలామా భారత్ కు వచ్చిన విషయం తెలిసిందే. దలైలామా భారత్లో ఉండడంతో టిబెట్ ఎప్పటికైనా చైనా నుండి విడుదల అవుతుందనే ఒక అశ టిబెట్ ప్రజల్లో ఉంది. ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ద వాతావరణం నెలకొంది. మరోవైపు చైనా అమెరికాతో కూడా యుద్ధానికి కాలు దువ్వుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా చైనా ఆక్రమించిన టిబెట్నీ ప్రత్యేక దేశంగా గుర్తించేందుకు పావులు కదుపుతోంది. అమెరికా కనుక టిబెట్ ను ప్రత్యేక దేశంగా గుర్తిస్తే దాని మిత్ర దేశాలు కూడా అలాగే చేస్తాయి. అదే జరిగితే దలైలామా కీలకం అవుతారు. అందుకే దలైలామా పై చైనా నిఘా పెట్టింది.  .

ఇటీవలే భారత్లో చైనా గూడచారిని భద్రతా దళాలు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దలైలామాకు దగ్గరగా ఉంటూ ఆయన భద్రతకు సంబందించిన విషయాలను ఎప్పటికప్పుడు చైనాకు చేరవేస్తున్న గూఢచారిని భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. దలైలామాకు హాని తలపెట్టెందుకు చైనా ప్రయత్నిస్తుందనే సమాచారం వచ్చింది. దలైలామా భారత్ను రక్షణ కోరి వచ్చారు. కాబట్టి ఆయనకు ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత భారత్ వహించాల్సీంటుంది. అందుకే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను మరింతగా పెంచాలని నిర్ణయించింది...!!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com