వలస కార్మికులకు శుభవార్త..."కఫాలా" నిర్మూలన..కనీస వేతనాన్ని పెంపు

- August 31, 2020 , by Maagulf
వలస కార్మికులకు శుభవార్త...\

ఖతార్: ఖతార్ ఆదివారం తన కార్మిక చట్టాలలో మార్పులను ప్రకటించింది. కనీస వేతనాన్ని నెలకు నుండి 25 శాతం /1,000 రియాల్స్ (పాతదానికంటే నెలకు 250 రియాల్స్ ఎక్కువ) కు పెంచటమే కాకుండా ఇకపై కార్మికులు ఉద్యోగం మారదలిస్తే, యజమానుల నుండి అనుమతి పొందవలసిన అవసరాన్ని రద్దు చేసింది. ఈ కొత్త రూల్ ఆరు నెలల్లో అమల్లోకి వస్తుంది. కానీ, ఉద్యోగాలు మారేందుకు యజమాని అనుమతి తొలగించడం మాత్రం వెంటనే అమలులోకి వస్తుంది. 

ఎటువంటి వివక్షత లేకుండా కార్మికులందరికీ వర్తించే దిశగా వలస కార్మికుల సంరక్షణకై ఈ నిర్ణయం తీసుకున్నట్టు కార్మిక మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ మహ్మద్ హసన్ అల్-ఒబైడ్లీ అన్నారు.

కంపెనీలు తప్పనిసరిగా వసతి మరియు ఆహారాన్ని కార్మికులకు అందించాలి. లేదా 800 రియాల్స్ కలిపి నెలవారీ స్టైఫండ్‌ను అందించాలి. వేతనాలు చెల్లించని లేదా తగిన వసతి కల్పించని కంపెనీలు కొత్త సంస్కరణల ప్రకారం కఠినమైన జరిమానాలను ఎదుర్కొంటాయని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

"విదేశీ కార్మికుల వీసాలు యజమానితో అనుసంధానించబడి ఉండే "కఫాలా" స్పాన్సర్‌షిప్ విధానం గల్ఫ్ రాష్ట్రాల్లో సాధారణం. తాజాగా తీసుకున్న నిర్ణయం ఈ "కఫాలా" వ్యవస్థను సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. ఈ చారిత్రాత్మక తీసుకున్న మొదటి గల్ఫ్ దేశంగా ఖతార్ నిలిచింది. ఖతార్ నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితి యొక్క కార్మిక సంస్థ ప్రశంసించింది." అని మహ్మద్ హసన్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com