అప్పటివరకు అంతర్జాతీయ విమానాలు తిరగవు
- August 31, 2020
న్యూ ఢిల్లీ: అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని పొడిగించారు.కమర్షియల్ ప్యాసింజర్ ఫ్లయిట్లపై నిషేధాన్ని సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కార్గో విమానాలకు ఇది వర్తించదు అని కేంద్ర విమానయాన శాఖ తన ప్రకటనలో పేర్కొంది.DGCA అనుమతి ఉన్న విమానాలకు కూడా ఈ నిబంధన వర్తించదు. ఎంపిక చేసిన రూట్లలో మాత్రం అధికారిక అనుమతి పొందిన అంతర్జాతీయ విమానాలకు అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పారు. అయితే విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందేభారత్ మిషన్ చేపట్టిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 01 తేదీ నుంచి 30 వరకు ఆరవ దశ వందేభారత్ మిషన్ చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎయిర్ ఇండియా రిలీజ్ చేసింది. కోవిడ్-19 నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!







