కరోనా నిబంధనలతో రెస్టారెంట్ బిజినెస్‌కి తీవ్ర నష్టం
- August 31, 2020
కువైట్ సిటీ:రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్, తమ వ్యాపారాలకు మరింత నష్టం వాటిల్లే ఎలాంటి నిబంధనల్నీ అంగీకరించే ప్రసక్తే లేదని పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో తీసుకొచ్చిన నిబంధనలు రెస్టారెంట్ వ్యాపారానికి తీవ్ర నష్టం మిగిల్చాయనీ, చాలా రెస్టారెంట్లు ఇప్పటికే మూతపడ్డాయని అసోసియేషన్ పేర్కొంది. 60 ఏళ్ళ పైబడిన వ్యక్తులకు రెస్టారెంట్లలో పనిచేయడం నుంచి నిషేధం విధిస్తున్నట్లు విధించిన నిబంధనను అసోసియేషన్ ఇప్పటికే వ్యతిరేకిస్తూ మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ కేటగిరీలోకి ఎక్కువమంది కార్మికులు వస్తారన్నది అసోసియేషన్ వాదన. కాగా, రెస్టారెంట్లు, సాప్లు అలాగే పేరలల్ మార్కెట్స్‌ని ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతిచ్చే దిశగా ఓ ప్రపోజల్‌ని ప్రభుత్వం తీసుకొస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కాగా, ప్రస్తుతం రెస్టారెంట్లు రాత్రి 8 గంటలకు మూసివేయడం జరుగుతున్న విషయం విదితమే.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష