కుప్పకూలిన భారత ఎకానమీ...ఎప్పటికి కోలుకుంటుందో!

- September 01, 2020 , by Maagulf
కుప్పకూలిన భారత ఎకానమీ...ఎప్పటికి కోలుకుంటుందో!

కరోనా దెబ్బకు భారత ఆర్థిక వృద్ధి రేటు కుప్పకూలింది. మైనస్‌లోకి వెళ్లింది. అది కూడా ఏకంగా మైనస్‌ 23.9గా అతి భారీ స్థాయిలో. వృద్ధిరేటు లేకపోగా ఈ స్థాయిలో మైనస్‌లోకి వెళ్లిపోవడం 40ఏళ్లలో ఇదే ప్రథమం. ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే కొంత ఊరటనిస్తోంది. మిగిలిన దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయి. వ్యవసాయ రంగం 3.4 శాతం వృద్దిరేటును నమోదు చేసింది.

రియల్టీ, ఫైనార్షియల్‌ రంగంలో క్షీణత మైనస్ 5.3శాతంగా ఉంది. వాణిజ్యం, హోటల్స్‌, కమ్యూనికేషన్‌లో ఈ పతనం మైనస్‌ 47 శాతంగా ఉంది. తయారీ రంగం మైనస్‌ 39.3 శాతానికి పడిపోయింది. నిర్మాణ రంగం అతిభారీగా దెబ్బతింది. ఈ రంగం క్షీణత మైనస్‌ 50.3 శాతంగా ఉంది. మైనింగ్‌ మైనస్‌ 23.3 శాతం, విద్యుత్, గ్యాస్‌ మైనస్‌ 7 శాతంగా క్షీణతను నమోదు చేశాయి.

జీడీపీ డేటా అందుబాటులో ఉన్న 1951 నుంచి చూస్తే 1958, 1966, 1967, 1973, 1980లో మైనస్‌ వృద్ధి రేటు నమోదు అయింది. 1980 తర్వాత ఇప్పుడే మళ్లీ జీడీపీ మైనస్‌ల్లోకి వెళ్లిపోయింది. ఆ ఆర్థిక ఏడాది మొత్తం మీద చూస్తే జీడీపీ పతనం మైనస్‌ 15 -20 శాతం మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com