అజ్మన్‌లో 120,000 సీసీటీవీ కెమెరాల ఏర్పాటు

- September 01, 2020 , by Maagulf
అజ్మన్‌లో 120,000 సీసీటీవీ కెమెరాల ఏర్పాటు

యూఏఈ:అజ్మన్‌ పోలీస్‌ స్టేషన్‌, ఎమిరేట్‌లోని పలు ప్రాంతాల్లో ‘టు ప్రొటెక్ట్‌ యు’ పేరుతో 3,000 భవనాల్లో 120,000 అడ్వాన్స్‌డ్‌ సర్వైలెన్స్‌ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ - అజ్మన్‌ పోలీస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ మొహమ్మద్‌ బిన్‌ యాఫుర్‌ అల్‌ ఘాఫ్లి వెల్లడించారు. 2017లో ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభించినప్పటినుంచి ఇప్పటిదాకా పెద్దయెత్తున కెమెరాల ఇన్‌స్టలేషన్‌ కార్యక్రమం కొనసాగుతున్నట్లు వివరించారు. అవసరమైన స్పెసిఫికేషన్స్‌కి తగ్గట్లుగా ఈ ఏర్పాట్లు చేశారు. దొంగతనాలు, ఇతర నేరాల్ని తగ్గించడంలో సీసీటీవీ కెమెరాలది కీలక పాత్ర అని ఆయన చెప్పారు. నిందితుల్ని పట్టుకోవడంలో ఈ సీసీటీవీ కెమెరాలు ఎంతో ఉపకరిస్తున్నాయని వివరించారు. అజ్మన్‌ పోలీస్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ సుల్తాన్‌ అల్‌ నౌమి మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సీసీటీవీ కెమెరాల్ని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లోనూ ఇన్‌స్టాల్‌ చేయడం జరుగుతోందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com