యూఏఈ చేరిన బీసీసీఐ బృందం..కార్యాలయ ఏర్పాటుకు యోచన
- September 01, 2020
ఏర్పాట్ల పర్యవేక్షణకై..
ఐపీఎల్ కోసం బీసీసీఐ కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ఎలాంటి అవాంతరాలు లేకుండా టోర్నీ జరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం చర్చించటానికి బీసీసీఐకి చెందిన ఉన్నతాధికారుల బృందం యూఏఈకి చేరుకుంది. ప్రభుత్వ అనుమతి కూడా రావడంతో ఐపీఎల్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాన్ని యూఏఈ లో ఏర్పాటు చేయాలనుకుంటోంది. బీసీసీఐ టీమ్‌లో ఉండే లీగ్ చైర్మన్ బ్రిజేష్ పటేల్, బోర్డు కార్యదర్శి జైషా, కోశాధికారి అరుణ్ ధూమల్, తాత్కాలిక సీఈవో హేమంగ్ అమిన్, ఫ్రాంచైజీల ప్రతినిధులు ప్రత్యేక విమానంలో యూఏఈకి చేరారు. ’ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ ప్రక్రియ ముగిశాక బీసీసీఐ బృందం యూఏఈకి చేరింది. వచ్చే మూడు నెలల కోసం దుబాయ్‌లో ఆఫీసును ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఈ బృందం భవిష్యత్ ప్రణాళికలపై ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అధికారులతో చర్చలు, వేదికల పరిశీలన, భారత దౌత్య కార్యాలయ సందర్శన, బయో బబుల్ ఏర్పాటుపై బిజీబిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
సీఎస్కె వెంట నెట్ బౌలర్లు
యూఏఈలో జరిగే ఐపీఎల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తమ వెంట నెట్ బౌలర్లను కూడా తీసుకెళ్లనున్నాయి. వీరిలో ఫస్ట్ క్లాస్ క్రికెటర్లతో పాటు అండర్-19, అండర్-23 విభాగాలకు చెందిన వారు ఉంటారు. ఈ జాబితాలో మరిన్ని జట్లు కూడా ఉండబోతున్నా యి. మామూలుగానైతే ఆయా జట్ల ఆటగాళ్లు స్థానిక బౌలర్లతో నెట్ ప్రాక్టీస్ చేసేవారు. కానీ ఇప్పుడు బయో సెక్యూర్‌లో టోర్నీ జరుగుతుండడంతో ప్రాక్టీస్ సెషన్స్ కోసం ఇక్కడి నుంచే నాణ్యమైన బౌలర్లను అక్కడికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అలాగే కేకేఆర్ కూడా అండర్-23, అండర్-19కి చెందిన పది మందిని తీసుకెళ్లాలని చూస్తోంది. ఢిల్లీ జట్టు మాత్రం ఆరుగురితో సరిపెట్టుకోవాలనుకుంటోంది. అక్కడి వాతావరణం, దుబాయ్ ట్రాక్‌ను అనుసరించి ఎక్కువగా స్పిన్నర్లు ఉండేలా జట్లు చూసుకుంటున్నాయి.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..