ఆ ఘోరాన్ని తట్టుకోలేకపోయా...అందుకే వచ్చేసా..సురేష్ రైనా
- September 01, 2020
టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కుటుంబ సభ్యులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో కుటుంబ సభ్యుల్లో ఒకరు కన్నుమూశారు. ఈ విషయాన్ని రైనా సోమవారం ట్విట్టర్‌లో తెలుపుతూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. పంజాబ్‌లో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని.. తన కుటుంబానికి ఏమైందో తెలియడం లేదని వాపోయాడు. తన మామ, అత్త, ఇద్దరు బంధువులపై దాడి జరిగిందని.. ఈ దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారని ట్వీట్ చేశారు. తను గత రాత్రి తుదిశ్వాస విడిచారని చెప్పాడు. తన అత్త ఆరోగ్యం విషమంగా ఉందని తెలిపాడు.
అసలా రోజు రాత్రి ఏమైందో ఇప్పటికి తెలియడం లేదని, దాడికి పాల్పడ్డ వారిని గుర్తించాలని పంజాబ్ పోలీసులకు ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశాడు. ఈ క్రూరమైన చర్యకు పాల్పడ్డ వారిని వెంటనే పట్టుకోవాలని.. వారు మరిన్ని దాడులకు పాల్పడకుండా అడ్డుకోవాలని కోరాడు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?