75 మంది ఉగ్రవాదులు హతo...

- February 09, 2016 , by Maagulf
75 మంది ఉగ్రవాదులు హతo...

 ఇరాక్‌లో ఉగ్రవాద ప్రభావిత ప్రాంతమైన రమాదిలో సోమవారం 75 మంది ఉగ్రవాదులు హతమైనట్లు భద్రతాదళాలు వెల్లడించాయి. రమాదిలో ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న రెండు ప్రాంతాలను ఇరాక్‌ ప్రభుత్వ భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి. రమాదికి పది కిలోమీటర్ల దూరంలో హుసైబా అల్‌-షర్‌ఖియా ప్రాంతంలో భద్రతాదళాలు ఉగ్రవాదులతో పోరాడాయి. అయిదుగురు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. దాదాపు 43 మంది మరణించగా, ఏడుగురు ఉగ్రవాదులు ప్రాణాలతో పట్టుబడ్డారు. నలుగురు భద్రతా సిబ్బంది మరణించగా, 12 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు.రమాది తూర్పు ప్రాంతంలోని జువిబాలో ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో 25 మంది ఉగ్రవాదులు హతం కాగా, ఎనిమిది మంది భద్రతా సిబ్బంది మరణించారు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులతో పోరాటం తర్వాత జువిబా జిల్లాలో పలు భవనాలపై ఇరాక్‌ దేశ జెండాను ఎగురవేశారు. రమాది నగరాన్ని ఐఎస్‌ ఉగ్రవాదులు గత ఏడాది స్వాధీనం చేసుకున్నారు. దానిని తిరిగి తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com