‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ విడుదల
- September 02, 2020పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకుడు. పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు(సెప్టెంబర్ 2) సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఒక వైపు మహాత్మాగాంధీ ఫొటో, మరో వైపు అంబేద్కర్ ఫొటో మధ్య పవన్ లాయర్ కోటు వేసుకుని నిలబడ్డారు. ఓ చేతిలో బేస్‌బాల్ స్టిక్, మరో చేతిలో క్రిమినల్ లా అనే పుస్తకం పట్టుకుని పవన్ ఠీవిగా నిలబడి ఉన్నలుక్‌తో ఉండేలా మోషన్ పోస్టర్ ప్రేక్షకాభిమానుల అంచనాలను మించేలా ఉంది. ఈ మోషన్ పోస్టర్ బ్యాగ్రౌండ్లో సత్యమేవ జయతే ... అనే బీట్ వినిపిస్తుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌గారి పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ విడుదల చేయడం హ్యాపీగా ఉంది. ఆయన అభిమానులు, సినీ ప్రేక్షకులు కోరుకునేలా ఓ పవర్ఫుల్ లాయర్ పాత్రలో పవన్‌కళ్యాణ్ గారు కనిపించబోతున్నారు. కరోనా వైరస్ పరిస్థితులు కాస్త చక్కబడ్డ తర్వాత మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసి సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్, ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, డైలాగ్స్: తిరు, యాక్షన్ రవివర్మ, వి.ఎఫ్.ఎక్స్: యుగంధర్, కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి, సమర్పణ: బోనీ కపూర్, నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్ , దర్శకత్వం: శ్రీరామ్ వేణు.
తాజా వార్తలు
- 175 కోట్ల నెక్లెస్ మెఘా సుధారెడ్డి షో
- ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు బెయిల్
- పోలింగ్ రోజు భారీ వర్ష సూచన..అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి
- కారు మరమ్మతుల కోసం 2 నెలల నిరీక్షణ..!
- నకిలీ వస్తువుల విక్రయం కేసు.. వ్యాపారి నిర్దోషి
- బిగ్ టికెట్ రాఫిల్.. తదుపరి డ్రా జూన్ 3న
- నకిలీ వెబ్సైట్ల గురించి PACI హెచ్చరిక
- ఇండియాలో చిక్కుకుపోయిన ఒమన్ వాసులు..!
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి