భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి

- May 10, 2024 , by Maagulf
భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి

మదీనా:  సౌదీ ఎయిర్‌లైన్స్ విమానంలో గురువారం భారతదేశం నుండి వచ్చిన 283 మంది యాత్రికుల మొదటి బ్యాచ్‌కు సౌదీ రవాణా మరియు లాజిస్టిక్స్ సేవల మంత్రి సలేహ్ అల్-జాసర్ స్వాగతం పలికారు. ఈ సీజన్ లో వేలాది మంది యాత్రికులు వార్షిక ఇస్లామిక్ తీర్థయాత్ర కోసం సౌదీ అరేబియాకు వెళతారు. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ మరియు క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్‌ల ఆదేశాల మేరకు యాత్రికులు హజ్ యాత్రను సజావుగా జరిగేలా చూసేందుకు రవాణా మరియు లాజిస్టిక్స్ రంగం తగిన ఏర్పాట్లు చేసినట్లు మంత్రి అల్-జాసర్ తెలిపారు.  ఈ సంవత్సరం కార్యకలాపాలలో ఆరు విమానాశ్రయాలలో యాత్రికుల కోసం  27వేల కంటే ఎక్కువ బస్సులను ఉపయోగించారు. యాత్రికుల కోసం హరమైన్ హై-స్పీడ్ రైల్వే మరియు అల్-మషాయర్ అల్-ముగద్దస్సా మెట్రో లైన్‌ మధ్య 5,000 ట్రిప్పులకు పైగా నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com