సౌదీ అరేబియా: అంతర్జాతీయ విమాన సర్వీసుల సస్పెన్షన్ కొనసాగింపు
- September 03, 2020
రియాద్: సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్ (సౌదియా), ఇంటర్నేషనల్ విమానాలకు సంబంధించి తదుపరి నోటీసు వరకు రద్దు కొనసాగించనున్నట్లు పేర్కొంది. దేశం నుంచి వెళ్ళేందుకు సిద్ధమైన రెసిడెంట్స్ కోసం అవదాహ్ ఇనీషియేటివ్ ద్వారా మాత్రం విమానాలు నడుస్తాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వలసదారులు తమ స్వస్థలాలకు వెళ్ళేందుకోసం అవదాహ్ కార్యక్రమాన్ని చేపట్టారు. అబ్షెర్ ప్లాట్‌ఫాం ద్వారా ఈ ఇనీషియేటివ్ చేపడుతున్నారు. ఇకిమా నంబర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, సిటీ ఆఫ్ డిపాచర్యూర్ అండ్ ఎరైవల్ ఎయిర్పోర్ట్ వంటి వివరాల ద్వారా రిజిస్టర్ చేసుకోవడానికి వీలు కల్పించారు. కాగా, ప్రయాణీకులు అన్ని ఆరోగ్య నిబంధనలూ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. యూఏఈ, కువైట్, ఒమన్, బహ్రెయిన్, ఈజిప్ట్, లెబనాన్, ట్యునీషియా, మొరాకో, చైనా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ, గ్రీస్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, మలేషియా, సౌత్ ఆఫ్రికా, సుడాన్, ఇది¸యోపియా, కెన్యా, నైజీరియా మరియు ఇండోనేసియా తదితర దేశాలకు చెందిన ట్రావెల్ రిక్వైర్మెంట్స్ వివరాల్ని సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్ పబ్లిష్ చేస్తోంది. మార్చి 15న సౌదీ అరేబియా అంతర్జాతీయ విమానాల్ని రద్దు చేసింది. డొమెస్టిక్ విమానాల్ని మే 31 నుంచి పునఃప్రారంభించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







