ఏపీలో ఒక్కరోజే 75 కరోనా మరణాలు
- September 03, 2020
అమరావతి:ఏపీలో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. రోజురోజుకూ మరణాల సంఖ్య ఆందోళనకర స్థాయిలో నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో 75 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు సంఖ్య 4వేల 2వందలకు చేరినట్లు.. ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో 10వేల 199 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం నమోదైన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 4లక్షల 65వేల 730కి చేరాయి. ఇప్పటి వరకు 3లక్షల 57వేల 829 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో లక్షా 3వేల 701 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 10మంది కరోనాతో మృతిచెందారు. చిత్తూరు, గుంటూరు జిల్లాలో 9మంది చొప్పున మృత్యువాత పడ్డారు. అనంతపురం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 7గురు చొప్పున చనిపోయారు. నెల్లూరులో 6, కడపలో 5, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







