24 గంటలూ రెస్టారెంట్స్ తెరచుకునే అవకాశం
- September 04, 2020
కువైట్ సిటీ:కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం ప్రకారం, ఇకపై 24 గంటలూ రెస్టారెంట్స్ తెరుచుకోవడానికి అనుమతిస్తున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది మునిసిపాలిటీ ఇంజనీర్ అహ్మద్ అల్ మన్‌ఫౌహి వెల్లడించిన వివరాల ప్రకారం, రెసిడెన్షియల్ ఏరియాస్‌లో మాత్రం రాత్రి 12 గంటలకు రెస్టారెంట్లు మూసెయ్యాల్సి వుంటుంది. కరోనా నేపథ్యంలో రెస్టారెంట్ల నిర్వహణపై ఆంక్షలు విధించిన విషయం విదితమే. క్రమక్రమంగా ఈ ఆంక్షల్ని సడలిస్తూ వస్తున్నారు. అయితే, ప్రైవేటు రెసిడెన్షియల్ ఏరియాస్‌లో మాత్రం రాత్రి 12 తర్వాత దుకాణాలు, రెస్టారెంట్లు తెరవడానికి వీల్లేదు. షిషా కూడా రెస్టారెంట్స్‌లో అందించడానికి వీల్లేదు. కాగా, సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్క్‌లు ధరించడం తప్పనిసరి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







