ఆ 6 రోజులు అత్యంత దుర్భరం:రవిచంద్రన్ అశ్విన్
- September 04, 2020
యూఏఈ:ఇంతకుముందు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను IPL 2020 కోసం వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేర్చుకున్నాయి. టీమిండియా దుబాయ్‌కు చేరుకోవడంతో, ఐపీఎల్ 13 కంటే ముందు, అతను ఆరు రోజులు నిర్బంధంలో ఉండాలి. క్వారంటైన్ లో గడిపిన ఆ ఆరోజులు తన జీవితంలో అత్యంత చెత్త రోజులుగా రవిచంద్రన్ అభివర్ణించాడు. ఇదే విషయాన్ని యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు. "నేను గత ఐదారు నెలలుగా ఇంట్లో ఉన్నాను, అయినా బిజీగానే గడిపాను.. నేను నా యూట్యూబ్ ఛానెల్లో నా స్వంత పనిని చేస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడాను. కానీ దుబాయ్ హోటల్ రూమ్ లో గడిపిన ఆరురోజులు చాలా చెత్తగా అనిపించింది.
ఎందుకంటే మొదటి రోజు హోటల్ బాల్కనీ నుంచి సరస్సును చూస్తూ గడిపాను. అక్కడి నుంచే బుర్జ్ ఖలీఫాను కూడా చూశాను. అద్భుతంగా అనిపించింది కాని బయట ఎంతసేపు కూర్చుని చూడగలం. అయినా ఇక్కడ చాలా వేడిగా ఉంది అని అశ్విన్ యూట్యూబ్ వీడియోలో తెలిపారు. దుబాయ్‌లో ఒంటరిగా గడిపిన ఆ ఆరు రోజులు అశ్విన్ తన మొబైల్ ఫోన్‌ను అధికంగా వినియోగించానని, పుస్తకాలు చదవడానికి తగినంతగా దృష్టి పెట్టలేదని చెప్పుకొచ్చాడు. "సాధారణంగా నేను మొబైల్ ఫోన్‌ను చూడను, ఎక్కువసేపు దాన్ని ఉపయోగించను. గత వారం రోజుల్లో మొత్తం ఆరుగంటలు మొబైల్ వాడాను. అది నా దృష్టిలో చాలా ఎక్కువ అని చెప్పాడు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







