డమాస్కస్‌లో పోలీస్ క్లబ్‌పై కారు బాంబు దాడి
- February 09, 2016
సిరియా రాజధాని డమాస్కస్‌లోని పోలీస్ క్లబ్‌పై జరిగిన కారు బాంబు దాడిలో పలువురు మృతి చెందినట్లు సమాచారం. దీని సమీపంలోనే రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ ఉండటంతో ప్రభావం మరింత తీవ్రంగా ఉండవచ్చని భావిస్తున్నారు. సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ నివేదిక ప్రకారం ఎనిమిది మంది మృతి చెందగా 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని ఈ సంస్థ పేర్కొంది. ఓ ఫిదాయి(ఆత్మాహుతి బాంబర్) పేలుడు పదార్థాలతో నిండిన ఓ కారును పోలీస్ క్లబ్ వద్దకు నడుపుకొంటూ వచ్చి పేల్చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







