లాక్ డౌన్ సమయంలో చేసుకున్న విమాన టికెట్ల బుకింగ్ డబ్బులు వాపస్:DGCA
- September 07, 2020
న్యూ ఢిల్లీ:లాక్ డౌన్ సమయంలో టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఛార్జీల డబ్బులను పూర్తిగా చెల్లించేందుకు డీజీసీఏ అంగీకరించింది. దేశీయ, విదేశీ ప్రయాణాలకు సంబంధించి మార్చి 25 నుంచి మే 3 మధ్య టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లందరికీ ఆయా విమాన సంస్థలు వెంటనే డబ్బులు చెల్లిస్తాయని డీజీసీఏ సుప్రీం కోర్టుకు తెలిపింది. లాక్ డౌన్ సమయంలో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు కావటంతో అప్పట్లో టికెట్లు బుక్ చేసుకున్నవాళ్లంతా నష్టపోయిన విషయం తెలిసిందే. అయితే..విమాన సర్వీసులను రద్దు చేసినా ప్రయాణికులకు తిరిగి డబ్బులు చెల్లించటంపై విమానయాన సంస్థలు ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో కువైట్ లోని ప్రవాసీ లీగల్ సెల్ అనే ఎన్జీవోలు గత జూన్ 12 సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రద్దు చేసిన డొమస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి సంబంధించి టికెట్లు బుక్ చేసుకున్నవాళ్లందరికీ పూర్తిగా డబ్బులు చెల్లించాలని తమ పిటిషనర్లు కోర్టును కోరారు. ఒకవేళ ఉన్నఫళంగా ప్రయాణికుల టికెట్ డబ్బులను తిరిగి చెల్లించలేని పక్షంలో భవిష్యత్తులో ఉచితంగా టికెట్లు ఇచ్చేలా ప్రస్తుత ఛార్జీ డబ్బులను క్రెడిట్ రూపంలో ప్రయాణికులకు అందించాలని తమ పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. మార్చి 31, 2021 వరకు క్రెడిట్ గడువు కొనసాగించాలని, ఒకవేళ అప్పటికే సదరు ప్రయాణికుడు..ప్రయాణం చేయాల్సిన అవసరం లేకపోవటం వల్ల టికెట్ బుక్ చేసుకోకుంటే..అతనికి 0.75% వడ్డీతో కలుపుకొని టికెట్ డబ్బులను విమానయాన సంస్థలు చెల్లించాలని కోరారు. పీటిషనర్ల అభ్యర్ధనపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వంతో పాటు విమానయాన సంస్థలకు నోటీసులు ఇచ్చింది. అదే సమయంలో లాక్ డౌన్ నాటి పరిస్థితుల దృష్టిలో ఉంచుకొని పిటిషనర్ దారులతో చర్చించి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది. సుప్రీం నోటీసులపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం, డీజీసీఏ ప్రయాణికులకు టికెట్ ఛార్జీలను పూర్తిగా చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అదేసమయంలో భారతకు సర్వీసులు నడిపిన విదేశీ విమానయాన సంస్థలకు కూడా ఇదే తరహా షరతులు వర్తించేలా ఆదేశించాలంటూ కోర్టును కోరింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..