భారత్‌లో కరోనా కేసుల కొత్త రికార్డు..
- September 07, 2020
న్యూ ఢిల్లీ:భారత్‌లో కరోనా కేసులు కొత్త రికార్డ్ సృష్టించాయి. 42 లక్షలపైగా కేసులతో ప్రపంచ జాబితాలో బ్రెజిల్‌ను దాటి భారత్ రెండోస్థానంలోకి చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 90 వేల 802 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల ఒక్క రోజులో ఒక వెయ్యి 16 మంది చనిపోయారు. ఇప్పటి వరకు దేశంలో కరోనా వల్ల మరణించినవారి సంఖ్య 71 వేల 642కి చేరింది. ప్రస్తుతం దేశంలో 8 లక్షల 82 వేల 542 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం ఒక్క రోజే కరోనా నుంచి కోలుకుని 69 వేల 564 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 32 లక్షల 50 వేల 429 మంది వైరస్ నుంచి రికవర్ అయ్యారు.
మహారాష్ట్రలో వైరస్ విజృంభణ రోజుకురోజుకు తీవ్రమవుతోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ రికార్డుస్థాయిలో 23 వేల 350 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9 లక్షలు దాటింది. మహారాష్ట్రలో 2 లక్షల 35 వేల యాక్టివ్ కేసులు ఉండగా... 6 లక్షల 44 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య 26 వేలు దాటింది. కేసుల పరంగా రెండో స్థానంలో ఉన్న ఏపీలో నిన్న మరో 10 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 4 లక్షల 98 వేలు దాటింది. ప్రస్తుతం 99 వేల యాక్టివ్ కేసులు ఉండగా.. 3 లక్షల 94 వేల మంది రికవర్ అయ్యారు. 4 వేల 4 వందల మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో గత 24 గంటల్లో దాదాపు 6 వేల పాజిటివ్ కేసులు నమోదవగా.. మొత్తం కేసుల సంఖ్య 4 లక్షల 64 వేలు దాటింది. భారత్‌లో ఇప్పటి వరకు 4 కోట్ల 88 లక్షల మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్టు..ICMR తెలిపింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







