సౌదీ:టెర్రరిజం కేసులో ముగ్గురికి మరణ శిక్ష
- September 07, 2020
రియాద్:సౌదీ అరేబియా క్రిమినల్ కోర్ట్, తీవ్రవాదంతో సంబంధం వుందన్న అభియోగాల నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులకు మరణ శిక్ష విధించింది. పలు బాంబు దాడుల్లో నిందితులకు సంబంధం వున్నట్లు నిరూపితమయ్యింది. మదీనాలో 2016 జులై 5న జరిగిన దాడితోనూ నిందితులకు సంబంధం వున్నట్లు విచారణలో తేలింది. నిందితులు సూసైడ్ బాంబర్‌కి పేలుడు పదార్థాలు కలిగిన బెల్ట్‌ని అందించినట్లు గుర్తించారు. డాక్టర్ సోలిమాన్ ఫకీహ్ హాస్పిటల్‌పై 2016 జులై 4న జరిగిన దాడితోనూ నిందితులకు సంబంధం వుందని తేలింది. ఇక్కడా సూసైడ్ బాంబర్ దాడికి పాల్పడ్డాడు. నిందితులు, తమ సహచరుడొకర్ని చంపేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు