భారత్ కు 11 ప్రత్యేక విమానాలు నడుపుతున్న ఖతార్ ఎయిర్ వేస్
- September 07, 2020
దోహా:ఖతార్ ఎయిర్ వేస్ భారత్ కు ప్రత్యేక విమానాలను నడుపుతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 6 నుంచే ఇండియాలోని 11 నగరాలకు సర్వీసులను నడుపుతున్నట్లు వెల్లడించింది. ఆక్టోబర్ 24 వరకు ఈ ప్రత్యేక విమాన సర్వీసులు కొనసాగుతాయి. అహ్మదాబాద్, అమృత్ సర్, బెంగళూరు, చెన్నై, కొచ్చి, ఢిల్లీ, హైదరాబాద్, కోల్ కతా, కోజికోడ్, ముంబై, తిరువనంతపురానికి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. భారత్ వెళ్లాలనుకునే వారు లేదంటే భారత్ నుంచి తిరిగి వచ్చే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఖతార్ ఎయిర్ వేస్ కోరింది. అయితే..ప్రయాణికుల ఆరోగ్య సంరక్షణ కోసం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించింది. అలాగే భారత్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచనలను కూడా ప్రయాణికులు దృష్టిలో ఉంచుకోవాలని, ప్రభుత్వ మార్గనిర్దేశకాలను అనుసరించాలని సూచించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..