జమాల్ ఖషోగి హత్య కేసులో 8 మందికి శిక్ష
- September 08, 2020
రియాద్:జమాల్ ఖషోగి(వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వ్యాసకర్త) హత్య కేసులో రియాద్ క్రిమినల్ కోర్టు 8 మందికి శిక్షలు ఖరారు చేసింది. సౌదీ రాకుమారుడు, దేశ పాలనలో ముఖ్యభూమిక పోషిస్తున్న మొహమ్మద్ బిన్ సల్మాన్‌పై తీవ్ర విమర్శలతో వాషింగ్టన్ పోస్ట్‌లో పలు వ్యాసాలు రాసిన ఖషోగి హత్య ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఖషోగి 2018లో టర్కీలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయంలో హత్యకు గురయ్యారు.
సౌదీ ప్రభుత్వమే ఈ హత్య చేయించిందనే ఆరోపణలు వచ్చాయి. రాకుమారుడు సల్మాన్ కార్యాలయంలో పనిచేసిన ఫోరెన్సిక్ నిపుణులు, ఇంటలిజెన్స్, భద్రతా సిబ్బంది నిందితులుగా విచారణను ఎదుర్కొన్నారు. ఖషోగి కుటుంబం క్షమాభిక్ష ప్రసాదించడంతో నిందితుల్లో ఐదుగురు ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నారు. వీరికి 20 ఏళ్ల చొప్పున శిక్ష పడింది. మిగిలిన నిందితుల్లో ఒకరికి పదేళ్లు, మరో ఇద్దరికి ఏడేళ్లు శిక్ష పడింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష