వలసదారుల రీ-ఎంట్రీ వీసాల చెల్లుబాటుపై ఎక్స్టెన్షన్
- September 08, 2020
జెడ్డా: సౌదీ అరేబియా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవజాత్), వలసదారుల రీ-ఎంట్రీ వీసాల వ్యాలిడిటీని పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది జవజాత్. రెసిడెంట్ పర్మిట్స్ (ఇకామా) గడువు తీరి, స్వదేశానికి రావాలనుకుంటున్న లేబరర్స్, డొమెస్టిక్ వర్కర్స్ కోసం ఈ గడువు పెంపుని ప్రకటించారు. సెప్టెంబర్ 30 వరకు ఈ పెంపు వర్తిస్తుంది. ఇకామా పొడిగింపులో కమర్షియల్ ప్రొఫెషన్స్‌లో పనిచేస్తున్నవారికి కూడా అవకాశం కల్పించారు. ఆగస్ట్ 1 నుంచి 31 లోపు గడువు తీరేవారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. మార్చి 15 నుంచి సౌదీ అరేబియా అంతర్జాతీయ విమానాల రాకపోకల్ని సస్పెండ్ చేసిన విషయం తెల్సిందే.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







