హత్యాయత్నం: ఒకరి అరెస్ట్‌

- September 08, 2020 , by Maagulf
హత్యాయత్నం: ఒకరి అరెస్ట్‌

మనామా:ఓ వ్యక్తి, మరో వ్యక్తిపై పదునైన ఆయుధంతో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడ్ని అరెస్ట్‌ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ పేర్కొంది. క్యాపిటల్‌ గవర్నరేట్‌ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, గుడైబియాలోని ఓ వ్యక్తిపై నిందితుడు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందగానే వెంటనే, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. దాడికి యత్నించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత తగాదా ఈ దాడికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి ఈ కేసుని రిఫర్‌ చేశారు పోలీసులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com