వాహనాల స్వాధీనానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన అబుధాబి పోలీసులు
- September 10, 2020
అబుధాబి:నిబంధనలు అతిక్రమించి డ్రైవింగ్ చేసే వారి వాహనాల స్వాధీనానికి సంబంధించి అబుధాబి పోలీసులు కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేశారు. కొత్త మార్గనిర్దేశకాల ప్రకారం ఎవరైన వాహనదారుడు పోలీసుల వాహనాలను ఢీకొన్నా..పోలీస్ వాహనాల డ్యామేజ్ కి కారణమైనా ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోవటంతో పాటు డ్రైవర్ కి 50 వేల దిర్హామ్ ల జరిమానా విధిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా రేసింగ్ లలో పాల్గొన్నా, సరైన నెంబర్ ప్లేట్ లేకున్నా ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోవటంతో పాటు 50 వేల దిర్హామ్ ల జరిమానా విధించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతివేగంగా నడిపి ప్రమాదాలకు కారణమైనా, రోడ్ క్రాసింగ్ కు నిర్దేశించిన ప్రాంతాల్లో పాదాచారులకు దారి ఇవ్వకున్నా డ్రైవర్ కు 5,000 దిర్హామ్ ల జరిమానా విధిస్తారు. పదేళ్లలోపు చిన్నారులను ముందు సీటులో కూర్చొబెట్టుకొని డ్రైవింగ్ చేసినా 5,000 దిర్హామ్ ల ఫైన్ విధిస్తారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







