బహ్రెయిన్ లో పెరుగుతున్న వైరస్ తీవ్రత..ప్రజలు గుమికూడొద్దని అధికారుల సూచన
- September 11, 2020
బహ్రెయిన్ లో కొద్ది రోజులుగా కరోనా వ్యాప్తి తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జాతీయ టాస్క్ ఫోర్స్ బృందం కరోనా వ్యాప్తి నియంత్రణకు పలు సూచనలు చేసింది. మరో రెండు వారాల వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా గుమికూడొద్దని హెచ్చరించింది. అంతేకాదు..పరిస్థితి అదుపులోకి రాకుంటే భవిష్యత్తులో వైరస్ వ్యాప్తి నియంత్రణకు మరిన్ని ఆంక్షలను అమలు చేసే అవకాశాలు ఉన్నాయని కూడా సంకేతాలిచ్చింది. ఇటీవల పలు కార్యక్రమాలకు సంబంధించి ప్రజలు పెద్ద ఎత్తున గూమికూడిన ఘటనల వల్లే కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతూ వస్తోందని ఎపిడెమియోలాజికల్ సర్వేలో తేటతెల్లమైంది. ఇదిలాఉంటే.. బహ్రెయిన్ లో ఇప్పటివరకు 57,540 వైరస్ కేసులు నమోదవగా...204 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష