అక్టోబర్ 2న తెలుగు ఓటీటీ 'ఆహా'లో విడుదలవుతున్న రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా'
- September 11, 2020
హైదరాబాద్:డిఫరెంట్ కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా ప్రేక్షకులను మరింతగా ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమవుతోంది. రీసెంట్‌గా ఆహాలో విడుదలైన భానుమతి అండ్ రామకృష్ణ, జోహార్ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన సంగతి తెలిసిందే. అదే కోవలో యువ కథానాయకుడు రాజ్ తరుణ్ హీరోగా నటించిన రొమ్‌కామ్ 'ఒరేయ్ బుజ్జిగా' గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయడానికి సన్నద్ధమవుతుంది. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించారు. మాళవికా నాయర్, హెబ్బాపటేల్ హీరోయిన్స్‌గా నటించారు. కుమారి 21 ఎఫ్‌లో సూపర్బ్ కెమిస్ట్రీతో హిట్ పెయిర్‌గా నిలిచిన రాజ్‌తరుణ్, హెబ్బాపటేల్ మరోసారి ఈ చిత్రంలో సందడి చేయనున్నారు. ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది.
అతి తక్కువ సమయంలోనే ఆహా ఓటీటీ ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకుంది. అభిమాన అగ్ర తారలు నటించిన క్లాసికల్ లైబ్రరీ ఆహా సొంతం. అందుకనే అతి తక్కువ సమయంలో ఆహా తనదైన స్థానాన్ని సొంతం చేసుకుని ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది.
యంగ్ హీరో రాజ్‌తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్‌కురువిళ్ళ, సప్తగిరి, రాజారవీంద్ర, అజయ్‌ఘోష్, అన్నపూర్ణమ్మ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధు నందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, డాన్స్: శేఖర్, ఆర్ట్: టి.రాజ్‌కుమార్, ఫైట్స్: రియల్ సతీష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్, నిర్మాత: కె.కె.రాధామోహన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్‌కుమార్ కొండ.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







