విజిట్ వీసా గడువు తీరినా,యూఏఈలో వుండిపోయేవారికి జరీమానా
- September 12, 2020
యూఏఈ:విజిటర్స్ లేదా టూరిస్టులు, మార్చి 1 తర్వాత వీసా గడువు తీరిపోయినప్పటికీ ఇంకా దేశంలోనే వుండిపోతే భారీ జరీమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సెప్టెంబర్ 11 నుంచి జరీమానాలు ప్రారంభమవుతాయి. ఓవర్‌స్టే జరీమానా తొలి రోజుకి 200 దిర్హాములు వుంటుందని అమెర్ సెల్ సెంటర్ ఏజెంట్ పేర్కొన్నారు. ఎయిర్ పోర్టుల వద్ద ఇమ్మిగ్రేషన్ అథారిటీస్ ఈ మొత్తాన్ని లెక్కిస్తారు. ప్రతి అదనపు రోజుకీ 100 దిర్హాములు అలాగే సర్వీస్ ఫీజు కింద 1000 దిర్హాములు వసూలు చేయడం జరుగుతుంది. ఆగస్ట్ 11న నెల రోజులపాటు గడువు పొడిగించగా, అది సెప్టెంబర్ 11తో ముగిసింది. ఎలాంటి అదనపు పొడిగింపూ ఇకపై వుండదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. విజిట్ వీసా వున్నవారు తమ స్టేటస్‌ని మార్చుకోవాలి లేదంటే, దేశం విడిచి వెళ్ళాల్సిందిగా అధికారులు స్పష్టం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







