వెడ్డింగ్ హాల్ మూసివేత, జరీమానా
- September 12, 2020
రస్ అల్ ఖైమా:రస్ అల్ ఖైమా ఎకనమిక్ డిపార్ట్మెంట్, ఓ వెడ్డింగ్ హాల్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. జరీమానా కూడా విధించడం జరిగింది. కరోనా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడంలో వైఫల్యం చెందిన కారణంగా ఈ చర్యలు తీసుకున్నారు. మాస్క్‌లు ధరించకపోవడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించకపోవడం వంటి ఉల్లంఘనల నేపథ్యంలో వెడ్డింగ్ హాల్ మూసివేతకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. కాగా, అబుదాబీ పోలీస్, పెళ్ళి జరుగుతున్న ఇంటిని సందర్శించి, అక్కడ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నవారికి జరీమానా విధించారు. 50,000 దిర్హాముల జరీమానా ఇలాంటి ఉల్లంఘనలకు విధించే అవకాశం వుంది.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







