మరోసారి గొప్ప మనసు చాటుకున్న ‘డిగ్రీ కాలేజ్’ హీరో
- September 12, 2020
హైదరాబాద్:కరోనా మహ్మమారి కారణంగా ఎందరో ఉపాధి కోల్పోయారు. అలాంటివారిని మరెందరో మానవత్వంతో ముందుకు వచ్చి.. కష్టకాలంలో సాయం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే.. పేద కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి సీసీసీ మనకోసం పేరిట ఓ సంస్థను స్థాపించి.. ఇప్పటికే మూడు విడతలు సాయం అందించారు. అలాగే సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులెందరో.. ఈ కరోనా కష్టకాలంలో ముందుకు వచ్చి.. పేదలకు సాయం చేశారు. అందులో ‘డిగ్రీ కాలేజ్’హీరో వరుణ్ కరోనా కష్టకాలం మొదలైనప్పటి నుంచి తనవంతు సహాయం అందిస్తూనే ఉన్నారు.
కాస్త కరోనా ఉదృతి తగ్గి.. పరిస్థితులు ఇప్పడిప్పుడే మెరుగుపడుతున్నాయి. కానీ వరుణ్ మాత్రం ఇప్పటికీ సహాయ కార్యక్రమాలు అందిస్తూనే ఉన్నారు. ఈ విపత్తులో ఆయన ఎందరికో నిత్యావసర సరుకులు అందించారు. యూనియన్ కార్డ్‌లేని సినీ ఆర్టిస్ట్ లకు, రోడ్డుపై ఉండే నిరుపేదలకు ఇలా తనకు సాధ్యమైనంతగా సహాయం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన హైదరాబాద్ ఫిల్మ్ నగర్ పరిసరాల్లోని పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్క్, శానిటైజర్స్ అందించి మరోసారి తన ఉదాత్త హృదయాన్ని చాటుకున్నారు.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







