కువైట్ లో భారీ అగ్నిప్రమాదం..

- September 13, 2020 , by Maagulf
కువైట్ లో భారీ అగ్నిప్రమాదం..

కువైట్ సిటీ:కువైట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తన మంటలు చెలరేగటంతో దాదాపు 300 మంది అగ్నిమాపక సిబ్బందిని బరిలోకి దింపారు. అల్ సబా హెల్త్ జోన్ ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పార్కింగ్ ప్రాంతం నుంచి మంటలు చెలరేగినట్లు ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు.  అయితే..భవనంలోని కొన్ని ఫ్లోర్ లను గోడౌన్ లుగా వినియోగిస్తున్నారు. కానీ, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా భారీగా సామాగ్రిని గోడౌన్ లో ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో మంటల తీవ్రత పెరిగిందని చెబుతున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం  అందిందని వెంటనే తగిన సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించామని ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. అయితే..మంటల తీవ్రత ధాటికి ఘటనా స్థలంలో విపరీతమైన సెగలు వచ్చాయని, థర్మల్ కెమెరా 322 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు వివరించారు. దీంతో అగ్నిమాపక సిబ్బందిలో 55 మంది అస్వస్థతకు గురయ్యారని వెల్లడించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com