సరైనా రెసిడెన్సీ వీసా ఉండి ఇంకా విదేశాల్లోనే 4,26,871 మంది ప్రవాసీయులు
- September 13, 2020
కువైట్ సిటీ:లాక్ డౌన్ తో కువైట్ వీసాదారులు ఇంకా వివిధ దేశాల్లో చిక్కుకుపోయారని..ఆగస్ట్ 23 నాటికి 4,26,871 మంది ప్రవాసీయులు సరైన రెసిడెన్సీ పర్మిట్ వీసా కలిగి ఉండి ఇంకా కువైట్ చేరుకోలేదని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. అయితే..వీసా గడువు ముగిసిన వారిని మాత్రం సుల్తానేట్లోకి అనుమతించబోమని ప్రవాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. అలాగే ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి తదుపరి అనుమతి వచ్చే వరకు విదేశీయులు ఎవరికి కొత్త వీసాలను జారీ చేయబోమని కూడా తెలిపారు. ఇక వీసా గడువు ముగిసినా ఇంకా దేశం విడిచి వెళ్లని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వారికి అనుమతించిన క్షమాభిక్ష గడువు ముగిసినందువల్ల చట్టపరమైన చర్యలతో పాటు..వారిని సుల్తానేట్ నుంచి పంపించివేస్తామని, మళ్లీ కువైట్ వచ్చేందుకు అనర్హులు అవుతారని వెల్లడించారు. ఇదిలాఉంటే..ప్రవాసీయులకు సంబంధించి ప్రవాసీ చట్ట సవరణ ప్రక్రియ కొనసాగుతోందని, నివేదికను రూపొందించి సంబంధిత అధికారులకు పంపిస్తామని..వారు ఆమోదం తెలుపాల్సి ఉంటుందన్నారు. మరోవైపు కువైట్ రెసిడెన్సీ వీసా కలిగి ఉండి ఇండియాలోనే చిక్కకుపోయిన ప్రవాసీయులు తిరిగి కువైట్ వెళ్లాలని అనుకుంటే ఎంబసీలో రిజిస్టర్ చేసుకోవాలని రాబాబార కార్యాలయం వెల్లడించింది. అయితే..ఈ ప్రక్రియ కేవలం ప్రవాసీయుల వివరాల సేకరణ కోసమేనని కూడా రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







