కోవిడ్ 19: పీసీఆర్ టెస్ట్ ధరను కేవలం 250 దిర్హామ్ లకు తగ్గించిన దుబాయ్
- September 13, 2020
దుబాయ్:కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో సాధారణ ప్రజలు కూడా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకునేలా దుబాయ్ ఆరోగ్య అధికార విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రజలకు ఆర్ధిక భారంగా మారకుండా పీసీఆర్ టెస్ట్ ధరలను 250 దిర్హామ్ లకు తగ్గించింది. టెస్ట్ ధరలను తక్కించటం ద్వారా ఎక్కువ మంది ప్రజలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. తద్వారా కరోనా నియంత్రణ చర్యలను ప్రొత్సహించినట్లు అవుతుందన్నారు. కరోనాను అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టడంలో దుబాయ్ ఆరోగ్య శాఖ ఎట్టిపరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయబోదని ఈ సందర్భంగా దుబాయ్ హెల్త్ అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష