జపాన్‌ నూతన ప్రధానిగా యోషిహిడే సుగా

- September 15, 2020 , by Maagulf
జపాన్‌ నూతన ప్రధానిగా యోషిహిడే సుగా

టోక్యో:జపాన్‌ అధికార పార్టీకి నూతన రధసారథిగా యోషిహిడే సుగాను ఎన్నికయ్యారు. అధికార లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీ అంతర్గత ఎన్నికల్లో 377 ఓట్లు సాధించిన సుగాను కాబోయే జపాన్‌ ప్రధానమంత్రిగా ప్రకటించింది. దీంతో జపాన్ క్యాబినెట్ ముఖ్య కార్యదర్శి యోషిహిడే సుగా దేశ తదుపరి ప్రధానిగా అవతరించనున్నారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డిపి) చట్టసభ సభ్యులు , ప్రాంతీయ ప్రతినిధులు వేసిన 534 చెల్లుబాటు అయ్యే ఓట్లలో 377 ని సాధించి, సుగా తన ఇద్దరు ప్రత్యర్థుల కంటే గణనీయంగా ముందువరుసలో నిలిచారు. ఉత్తర జపాన్ లోని గ్రామీణ అకిటాలో స్ట్రాబెర్రీ రైతు కుమారుడైన సుగా.. అక్కడ హైస్కూల్ విద్య అనంతరం టోక్యోకు వెళ్లారు.. అనంతరం నైట్ కాలేజీలో కాలేజీ విద్య పూర్తి చేశారు. ఆ తరువాత టోక్యో లోని యోకోహామాలో మునిసిపల్ అసెంబ్లీ సభ్యుడిగా 1987లో ఎన్నికయ్యారు. అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ప్రధాని పదవిని అధిరోహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com