తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్ మృతి పట్ల ఎపి గవర్నర్ దిగ్భ్రాంతి

తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్ మృతి పట్ల ఎపి గవర్నర్ దిగ్భ్రాంతి

విజయవాడ:తిరుపతి పార్లమెంట్ సభ్యుడు బల్లి దుర్గా ప్రసాద్ ఆకస్మిక మృతి పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్  తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బుధవారం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా దుర్గాప్రసాద్ ప్రజాసేవలో అవిరళ కృషి చేశారన్నారు. బల్లి దుర్గా ప్రసాద్ రావు సేవలను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని గవర్నర్ హరిచందన్ అన్నారు. ప్రసాద్ రావు 28 సంవత్సరాల వయస్సులోనే ఎమ్మెల్యే అయ్యారని ప్రస్తుతించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్న బిశ్వ భూషణ్, దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ మేరకు రాజ్ భవన్ ప్రకటన విడుదల చేసింది.

Back to Top