కువైట్ లో కొత్తగా మరో 698 కరోనా పాజిటివ్ కేసుల నమోదు
- September 16, 2020
కువైట్ సిటీ:ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా కరోనా తీవ్రత మాత్రం కొనసాగుతూనే ఉంది. కువైట్ లో 24 గంటల్లో కొత్తగా మరో 698 మందికి కరోనా వైరస్ సోకినట్లు ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించిన బులెటిన్ లో తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు 96, 999 పాజటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 24 గంటల్లో మరో ముగ్గురు మరణించటంతో మృతుల సంఖ్య 571కి చేరింది. అయితే..కరోనా పాజిటివ్ కేసులతో పాటు రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతుండటం ఊరట కలిగించే అంశం. గత 24 గంటల్లో మరో 968 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 87,187కి పెరిగింది. ప్రస్తుతం 9,241 మందికి పలు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







