దుబాయ్:స్విమ్మింగ్ పూల్ లో చిక్కుకుపోయిన మూడేళ్ల చిన్నారిని రక్షించిన పోలీసులు

- September 16, 2020 , by Maagulf
దుబాయ్:స్విమ్మింగ్ పూల్ లో చిక్కుకుపోయిన మూడేళ్ల చిన్నారిని రక్షించిన పోలీసులు

దుబాయ్:దుబాయ్ పోలీసులు స్విమ్మింగ్ పూల్ లో చిక్కుకుపోయిన బాలుడ్ని రక్షించి సురక్షితంగా అతని తల్లిదండ్రులకు అప్పగించారు. స్విమ్మింగ్ పూల్ డ్రైయిన్ లో మూడేళ్ల బాలుడి చెయ్యి ఇరుక్కుపోయింది. దీంతో ఆ చిన్నారి బయటికి రాలేక అవస్థ పడుతుండటంతో తల్లిదండ్రులు తమ బాబును రక్షించాలంటూ పోలీసులను కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని రెండు గంటల పాటు శ్రమించి బాలుడ్ని సురక్షితంగా రక్షించారు. దుబాయ్ లోని ఓ ఇంట్లో వ్యక్తిగత స్విమ్మింగ్ ఫూల్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆడుకుంటున్న చిన్నారి డ్రైయిన్ మూతను తొలగించటంతో చిన్నారి చెయ్యి అందులో ఇరుక్కుపోయింది. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు స్విమ్మింగ్ పూల్ లోని నీటిని తొలగించటంతో పాటు ముందస్తుగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. స్పాట్ కు ఆంబులెన్స్ ను పిలిపించారు. ఆ తర్వాత ప్రత్యేక పరికరాలతో డ్రైయిన్ చుట్టు ప్రాంతాన్ని పగలగొట్టి పైప్ లైన్ ను తొలగించి బాబు చెయ్యిని బయటికి తీశారు. అప్పటికే అక్కడకు చేరుకున్న ఆంబులెన్స్ సిబ్బంది బాబుకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com