రజనీ రాజకీయ ప్రవేశం షురూ..
- September 17, 2020
చెన్నై:తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే అంశానికి తెరపడినట్లైంది ప్రస్తుత అంశాలు పరిశీలిస్తుంటే. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీచేయడానికి సిద్దపడుతున్నారు. ఈలోగా ఆయన గెలిచేందుకు అవకాశం ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో సర్వే చేయించే ప్రయత్నాల్లో ఉన్నారు. లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన రజనీ రెండు సినిమాలు చిత్రీకరణకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రజనీ ప్రారంభించాలని ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయాలని రజనీ అభిమానులు, మక్కల్ మండ్రం పోస్టర్లు అంటించి సంచలనం సృష్టిస్తున్నారు. తాను రాజకీయ ప్రవేశం చేయనున్న శుభముహూర్తం గురించి వారికి రజనీ తెలిపారు. మక్కల్ మండ్రం నాయకుల సమాచారం ప్రకారం రజనీ నవంబర్‌లో రాజకీయ పార్టీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మధురై లేదా వేలూరులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీ పేరును ప్రకటించే ఆలోచనలో రజనీ ఉన్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







