దర్శకుడు ఎన్. శంకర్ చేతుల మీదుగా తెరవెనుక ఫస్ట్ లుక్ విడుదల!
- September 17, 2020
ఆయుష్ క్రియేషన్స్ పతాకంపై విజయలక్ష్మి మురళి మచ్చ సమర్పణలో
మురళి జగన్నాథ్ మచ్చ నిర్మాతగా రూపుదిద్దుకున్న చిత్రం " తెరవెనుక " .
ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో విశాఖ ధిమాన్, దీపిక రెడ్డి హీరోయిన్ లుగా, ఆనంద చక్రపాణి , నిట్టల శ్రీరామమూర్తి , TNR , శ్వేత వర్మ , సంపత్ రెడ్డి ముఖ్య పాత్రధారులుగా నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు ఎన్. శంకర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎన్. శంకర్ మాట్లాడుతూ...
తెరవెనుక చిత్ర దర్శకుడు ప్రవీణ్ చంద్ర నాకు గత 25 ఏళ్లుగా తెలుసు. తన మొదటి సినిమాకు సహకరించిన అందరికి ధన్యవాదాలు ఈ సినిమాతో ప్రవీణ్ చంద్ర మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పనిచేసిన అందరూ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెరవెనుక అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
దర్శకుడు నెలుట్ల ప్రవీణ్ చంద్ర మాట్లాడుతూ...
సామాజిక స్పృహ కలిగిన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపుదిద్దుకున్న తెరవెనుక చిత్ర ఫస్ట్ లుక్ ఎన్. శంకర్ గారు విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. నిర్మాత మురళి జగన్నాధ్ మచ్చ గారు నన్ను నమ్మి ఈ సినిమా నాకు ఇవ్వడంతో బాధ్యత పెరిగింది. అందరి అంచనాలకు తగ్గట్లు ఈ సినిమా ఉండబోతోంది. త్వరలో ఈ సినిమా టీజర్ ను విడుదల చెయ్యబోతున్నామని తెలిపారు.
నటీనటులు:
అమన్, విశాఖ ధిమాన్, దీపిక రెడ్డి హీరోయిన్ లుగా, ఆనంద చక్రపాణి , నిట్టల శ్రీరామమూర్తి , టి.ఎన్.ఆర్ ,శ్వేత వర్మ , సంపత్ రెడ్డి తదితరులు.
సాంకేతిక నిపుణులు:
కథ, మాటలు - బాబా
కెమెరా - రాము కంద,
ఎడిటర్ - బొంతల నాగేశ్వరరెడ్డి
మ్యూజిక్ - రఘురామ్
ఫైట్స్ - సూపర్ ఆనంద్
డాన్స్- కపిల్, శిరీష్ , అనీష్
లిరిక్స్- కాసర్ల శ్యామ్, సురేష్ బనిశెట్టి , బండి సత్యం రఘురామ్
పిఆరోఒ - మధు వి.ఆర్
తాజా వార్తలు
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!







