సాయం కోసం భిక్షాటన చేసిన నటుడు శంకర్!!
- September 17, 2020
తన 'నటనార్జితం' నుంచి లక్షా పది వేలు వెచ్చించి... ఇటీవల ఓ రైతు కూలీ కుటుంబానికి కాడెద్దులు-నాగలి బహూకరించిన ప్రముఖ నటుడు శంకర్... తాజాగా కరోనా కారణంగా కకావికలమైన ఏడు కుటుంబాలను ఆదుకున్నారు.
ఇందుకోసం ఆయన కరీంనగర్ వీధుల్లో భిక్షాటన చేపట్టారు. దీని ద్వారా సుమారు 90 వేలు సమకూరగా... మిగిలిన డబ్బులు తను జోడించి... మొత్తం లక్ష రూపాయలతో... కరీంనగర్ లోని ఏడు కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించారు.
ఈ సేవా కార్యక్రమం తాను చేపట్టేలా ప్రేరేపించి... అందుకు తనకు సహకరించిన కరీంనగర్ 'విందు భోజనం' మహేంద్ర, వెంకట్ రెడ్డి, గోపాల్ రెడ్డి, బిటిఆర్ లకు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. నెలకొక పర్యాయం ఇలాంటి సేవా కార్యక్రమం చేయలనుకుంటున్నానని, అందుకు ఆ సర్వేశ్వరుడి అనుగ్రహం వేడుకుంటున్నానని శంకర్ పేర్కొన్నారు!!
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







