దోహా: ఘనంగా మోక్షగుండం జయంతి వేడుక.. ఇంజనీర్లను సత్కరించిన ఖతార్ కర్ణాటక సంఘం

- September 17, 2020 , by Maagulf
దోహా: ఘనంగా మోక్షగుండం జయంతి వేడుక.. ఇంజనీర్లను సత్కరించిన ఖతార్ కర్ణాటక సంఘం

ఖతార్: మోక్షగుండం విశ్వేశ్వరయ్య 160వ జయంతి వేడుకను ఖతార్ కర్ణాటక సంఘం ఘనంగా నిర్వహించింది. ప్రతి ఏడాది మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి రోజున ప్రముఖ ఇంజనీర్లను ఖతార్ కర్ణాటక సంఘం ఆధ్వర్యంలో సత్కరించటం అనవాయితీగా వస్తోంది. భారత్ కు చెందిన ఇంజనీర్లను ఎంపిక చేసి వారిని అభియంతరశ్రీ పురస్కారంతో సత్కరిస్తుంటారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇంజనీర్ హేమచందర్ ను ఖతార్ కర్ణాకట సంఘం సత్కరించింది. హేమచందర్ ప్రస్తుతం గల్ఫర్ అల్ మిస్నాద్ అనే ఇన్ ఫ్రా సంస్థలో సీనియర్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే కర్ణాటకకు చెందిన ఇంజనీర్ మహేష్ గౌడను అభియంతర శ్రీ
పురస్కారంతో సత్కరించారు. మహేష్ గౌడ ప్రస్తుతం ఐసీబీఎఫ్ చీఫ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఒరేడూ ఖతార్ చీఫ్ స్ట్రాటజిక్ అధికారి ఇంజనీర్ మునేరా ఫహద్ అల్ దోసారీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకకు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఇంటిగ్రేటెడ్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఖతార్ కర్ణాటక సంఘం అధ్యక్షుడు నాగేష్ రావుతో  మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com