ఇంటర్నేషనల్ ఎరైవల్స్‌కి కోవిడ్ 19 ట్రాకింగ్ డివైజ్ తప్పనిసరి
- September 18, 2020
అబుధాబి:అబుధాబి ఎయిర్ పోర్ట్ ద్వారా వచ్చే ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్, కరోనా వైరస్ ట్రాకింగ్ డివైజ్‌ని తప్పక ధరించాలని, 14 రోజుల మాండేటరీ క్వారంటైన్‌ని పూర్తి చేయాలని ఎతిహాద్ ఎయిర్‌వేస్ స్పష్టం చేసింది. కాగా, యూఏఈలో ఇటీవల డెయిలీ ఇన్‌ఫెక్షన్స్ పెరుగుతున్న దరిమిలా అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలకు సమాయత్తమవుతున్నారు. సోషల్ డిస్టెన్సింగ్ పాటించకపోవడమే కరోనా వ్యాప్తికి కారణమని అధికారులు అంటున్నారు.అబుధాబి ఎయిర్ పోర్ట్ ద్వారా వచ్చే ప్రయాణీకులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు, 14 రోజుల హోం క్వారంటైన్‌ని విధిస్తున్నారు. గడచిన రెండు వారాల్లో నమోదైన కేసుల్లో 88 శాతం కేసులు గేదరింగ్స్ వల్ల వచ్చినవేననీ, వీటిల్లో 12 శాతం కేసులు అంతర్జాతీయ ప్రయాణికులకి సంబంధించినవని అధికారులు చెబుతున్నారు. కాగా, ఇప్పటిదాకా యూఏఈలో 82,568 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 402 మంది ప్రాణాలు కోల్పోయారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..