ఎయిరిండియా సర్వీసులను రద్దు చేసిన దుబాయ్..15 రోజుల పాటు షార్జాకు విమానాల మళ్లింపు

- September 18, 2020 , by Maagulf
ఎయిరిండియా సర్వీసులను రద్దు చేసిన దుబాయ్..15 రోజుల పాటు షార్జాకు విమానాల మళ్లింపు

యూఏఈ : ఎయిరిండియా విమాన సర్వీసుల నిర్లక్ష్యం చివరి నిమిషంలో ప్రయాణికులకు తిప్పలు తెచ్చిపెట్టింది. కరోనా పాజిటివ్ పేషెంట్లను ఇండియా నుంచి దుబాయ్ కి అనుమతించారనే ఆరోపణతో దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఎయిరిండియా విమానాలను 15 రోజుల పాటు రద్దు చేసింది. కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన మార్గదర్శకాలు పాటించాల్సి ఉన్నా..భారత్ నుంచి దుబాయ్ కి ఫ్లైట్స్ నడుపుతున్న ఎయిరిండియా రెండు సందర్భాల్లో ఇద్దరు కరోనా పాజిటివ్ ప్రయాణికులను అనుమతించిందని దుబాయ్ ఏవియేషన్ అథారిటీ చెబుతోంది. అందుకే 15 రోజుల పాటు సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించింది. దీంతో ఎయిరిండియా తమ ప్రయాణికులకు గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రత్యామ్నాయంగా ఫ్లైట్స్ ను షార్జా నుంచి ఆపరేట్ చేస్తోంది. దుబాయ్ కి భారత్ కు వచ్చే ఫ్లైట్స్ ను అలాగే భారత్ ను దుబాయ్ వెళ్లే ఫ్లైట్స్ ను షార్జాకు మళ్లించింది. శుక్రవారం దుబాయ్ నుంచి కలకత్తా, తిరువనంతపురం, ఢిల్లీ, ముంబై, కన్నుర్ కు షెడ్యూల్ అయిన విమానాలను షార్జా నుంచి రీషెడ్యూల్ చేసింది. షార్జా నుంచి రీషెడ్యూల్ అయిన ఫ్లైట్స్ వివరాలు...
* షార్జా- కలకత్తా ( బయల్దేరు సమయం 13:15....గమ్యస్థానానికి చేరుకునే సమయం 18:55 )
* షార్జా- తిరువనంతపురం ( బయల్దేరు సమయం 14:30....గమ్యస్థానానికి చేరుకునే సమయం 20:10 )
* షార్జా- ఢిల్లీ ( బయల్దేరు సమయం 16:30....గమ్యస్థానానికి చేరుకునే సమయం 21:30 )
* షార్జా- ముంబై( బయల్దేరు సమయం 18:30....గమ్యస్థానానికి చేరుకునే సమయం 23:15 )
* షార్జా- కన్నుర్ ( బయల్దేరు సమయం 23:55....గమ్యస్థానానికి చేరుకునే సమయం 05:05 )
ప్రయాణికులు దుబాయ్ నుంచి షార్జా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేందుకు వీలుగా ముందుగా నిర్ణయించిన ఫ్లైట్ షెడ్యూల్ కంటే కొద్ది గంటలు ఆలస్యంగా రీషెడ్యూల్ చేసి షార్జా నుంచి ఎయిరిండియా అదనపు ఫ్లైట్స్ ను ఏర్పాటు చేసింది. 15 రోజుల పాటు దుబాయ్ విమానాశ్రయానికి ఎయిరిండియా విమానాలు వెళ్లే అవకాశం లేకపోవటంతో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారు షార్జా విమానాశ్రయం నుంచి మళ్లీ టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. ఇదిలాఉంటే.. ప్రయాణికులకు ఫ్లైట్స్ మళ్లింపు విషయాన్ని ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించినా...చివరి నిమిషంలో విమానాల దారిమళ్లింపు నిర్ణయంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com