ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..
- September 19, 2020
తిరుమల:తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ధ్వజారోహనంతో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బ్రహ్మోత్సవాలు ఈ సారి ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. గుడి ప్రాకారం లోపలే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఇదే మొదటి సారి. సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నెల 23న గరుడసేవ జరగనుంది. కోవిడ్ కారణంగా తిరుమల చరిత్రలోనే తొలిసారిగా ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 27న చక్రస్నానంతో ముగుస్తాయి. శ్రీవారి భక్తులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని టీటీడీ ప్రకటించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎస్వీబీసీ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని వెల్లడించింది. ఈ నెల 23న సాయంత్రం గరుడ వాహనసేవ అనంతరం తిరుమలలో కర్ణాటక సత్రం, యాత్రికుల వసతి సముదాయాలు శంకుస్థాపనకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..