ఐపీఎల్ హంగామా వీక్షించండి ఈ చానళ్లలో..
- September 19, 2020
కరోనా కారణంగా వినోదానికి దూరమైన క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ 13వ సీజన్ ఊరట కలిగించనుంది. కరోనా ఆంక్షల నడుమ ఉంటుందా లేదా అన్న అనుమానాలను బద్దలు కొడుతూ నేడు సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. వైరస్ కారణంగా ఈసారి ఐపీఎల్ ఆతిథ్యాన్ని యూఏఈ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆరంభ మ్యాచ్‌లో ఈ సాయంత్రం డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగనున్నాయి. అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో తొలిమ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ ఆరంభ పోరుకు ఆతిథ్యమిస్తున్న షేక్ జయేద్ స్టేడియం పిచ్‌పై గతంలో భారీ స్కోర్లు నమోదైన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ మందకొడిగా ఉండే పిచ్‌పై పవర్ హిట్టింగ్ చేద్దామంటే కుదరదు. సహనంతో బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు రాణించే అవకాశాలు ఉన్నాయి.
పైగా పెద్ద మైదానం కావడంతో సిక్సర్లు కొట్టాలంటే బ్యాట్స్‌మెన్ అదనంగా శ్రమించాల్సి ఉంటుంది. ప్రారంభ పోరులో తలపడుతున్న ఈ రెండు జట్లు ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 28 సార్లు నువ్వానేనా అనుకున్నాయి. ముంబయి జట్టు 17 సార్లు విజయం అందుకోగా, సూపర్ కింగ్స్ 11 సార్లు గెలిచింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయి ఇండియన్స్ 4 సార్లు టైటిల్ నెగ్గగా, ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మూడుసార్లు విజేతగా నిలిచింది. ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ టోర్నీ లైవ్ టెలికాస్ట్ వివరాలు ఏంటో చూద్దాం.
ఇంగ్లీష్ టెలికాస్ట్:
స్టార్ స్పోర్ట్స్ 1
స్టార్ స్పోర్ట్స్ 2
స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 1
స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 2
హిందీ టెలికాస్ట్:
స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ
డీడీ నేషనల్
తెలుగు టెలికాస్ట్:
మా మూవీస్
ఆన్‌లైన్ బ్రాడ్ కాస్టింగ్ (ఓటీటీ ప్లాట్ ఫామ్):
హాట్ స్టార్
జియో టీవీ
రెడ్ బాక్స్ టీవీ
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







