దుబాయ్:కోవిడ్ 19 నిబంధనలు పాటించని కేఫ్ మూసివేత, మరో 7 షాపులపై జరిమానా
- September 19, 2020
దుబాయ్:కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం సూచించని నిబంధనలు పాటించని షాపులపై దుబాయ్ వాణిజ్య విభాగం అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా చేపట్టిన తనిఖీల్లో నిబంధనలు పాటించని ఓ కాఫీ షాప్ ను మూసివేశారు. ఫేస్ మాస్కులు ధరించపోవటం, భౌతిక దూరం పాటించకపోవటంతో షాపును మూసివేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఇంటర్నేషన్ సిటీ, అల్ బదా ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 12 షాపుల నిర్వాహకులు నిబంధనలు పాటించటంలో విఫలమైనట్లు గుర్తించారు. భౌతిక దూరం పాటించని ఏడు షాపులపై జరిమానా విధించామని, భౌతిక దూరం పాటించాలంటూ సూచించే స్టిక్కర్లను ప్రదర్శించని ఐదుగురు దుకాణుదారులను హెచ్చరించామని వెల్లడించారు. కోవిడ్ 19 నిబంధనలు విషయంలో దుకాణుదారులు తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సిందేనని అధికారులు మరోసారి సూచించారు. ఎవరైనా నిబంధనలు పాటించనట్లైతే వారిపై దుబాయ్ కన్సూమర్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవల్సిందిగా ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష