ఇక కార్మికుల కాంట్రాక్టులన్ని ఆన్ లైన్ లో రిజిస్టర్ చేయాలని ప్రైవేట్ సంస్థలకు ఒమన్ ఆదేశం

- September 19, 2020 , by Maagulf
ఇక కార్మికుల కాంట్రాక్టులన్ని ఆన్ లైన్ లో రిజిస్టర్ చేయాలని ప్రైవేట్ సంస్థలకు ఒమన్ ఆదేశం

మస్కట్:ప్రవైట్ రంగంలో సంస్థ యాజమాన్యం, కార్మికుడి మధ్య కుదర్చుకునే వర్క్ కాంట్రాక్టులను ఆన్ లైన్ రిజిస్టర్ చేయాలని ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఇక నుంచి ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు..తమ కార్మికులతో కుదర్చుకునే పని ఒప్పందాలను మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ద్వారా నిర్వహించాల్సి ఉంటుంది. ప్రైవేట్ యాజమాన్యం ముందుగా పని ఒప్పందానికి సంబంధించిన వివరాలను ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసి సదరు కార్మికుడికి నోటిఫికేషన్ పంపిస్తారు. ఆ ఒప్పందంలోని అంశాలను బట్టి సదరు కార్మికుడు ఒప్పందాన్ని అంగీకరించవచ్చు...లేదంటే తిరస్కరించవచ్చు. అయితే..వర్క్ కాంట్రాక్టులో కార్మికుడికి ఇచ్చే జీతం, ఇతర అలవెన్సుల విషయంలో మంత్రిత్వ శాఖ జోక్యం ఉండదు. అది పూర్తిగా కంపెనీ యాజమాన్యం, కార్మికుడి మధ్య పరస్పర అవగాహన మేరకే ఒప్పందం జరుగుతుంది. అయితే..కార్మిక చట్టంలోని కనీస వేతనం నిబంధనలను మాత్రం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని కార్మిక మంత్రిత్వ శాఖ తమ
ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం పరిస్థితులకు అనుగుణంగా జాతీయ కార్మికశక్తిని మెరుగు పరిచేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జాతీయ ఆర్ధిక స్థిరత్వానికి శ్రామిక శక్తిని మరింత ఉత్తేజితం చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. కార్మిక చట్టాలు, నియంత్రణ విధానాలను పునసమీక్షించటం ద్వారా లేబర్ మార్కెట్ పునరుత్తేజం తీసుకురావటమే తమ లక్ష్యమని వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com